ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు వేడుకలను తాలిబన్లు రద్దు చేసుకున్నారు.ఇప్పటికే మంత్రివర్గాన్ని ప్రకటించిన తాలిబన్లు..శనివారం పెద్ద ఎత్తున వేడుకలకు ప్లాన్ చేశారు.తమకు మిత్రులుగా ఉన్న చైనా,పాకిస్తాన్,ఇరాన్,టర్కీ, ఖతార్,రష్యా సహా పలు దేశాలను కూడా వేడుకలకు ఆహ్వానించారు.
కానీ తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటు వేడుకలను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.పైగా సెప్టెంబర్ 11న అమెరికాపై ఆల్ ఖైదా దాడులకు 20ఏళ్లు అవుతున్నాయి.ఆల్ ఖైదా ముందు నుండి తాలిబన్లకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది.దీంతో ఈ సమయంలో వేడుకలు సరైంది కాదు..అమెరికాను రెచ్చగొట్టడమే అవుతుందని తాలిబన్లకు తమ మిత్ర దేశాలు సూచించటంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నారా..? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ విషయాన్ని రష్యన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటైనందున కొత్త ప్రభుత్వం తన పని ప్రారంభించినట్లు తాలిబన్లు ధృవీకరిస్తున్నారు.