అఫ్ఘన్ లో తాలిబన్లు అధికారం చేపట్టకముందే వారి ఇష్టానుసారంగా ఆదేశాలివ్వటం మొదలుపెట్టారు. కొంతకాలంగా దేశంలో ఉన్న అనిశ్చితి కారణంగా మూతపడిన విద్యాసంస్థలు క్రమంగా తెరుచుకుంటున్న సమయంలో తాలిబన్లు జారీ చేసిన ఫత్వా తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది.
తాలిబన్ల ఫత్వా ప్రకారం… యూనివర్శిటీల్లో చదువుకునే ఆడ, మగ విద్యార్థులను నేరుగా కలుసుకునే అవకాశం ఉండకూడదు. ఆడ, మగ విద్యార్థులకు మధ్య కర్టెన్లుండాలని ఆదేశించింది. వీలైతే వేర్వేరు క్లాసులు నిర్వహించాలని పైగా క్లాసుల్లోకి వచ్చే దారులతో పాటు ఎగ్జిట్ కూడా వేర్వేరుగా ఉండాలని స్పష్టం చేసింది. ఆడవారికి మహిళలే క్లాసులు చెప్పాలని… ఒకవేళ సాధ్యంకాకపోతే మంచి నడవిక ఉన్న వృద్ధులను ఉపయోగించుకోవాలని కాలేజీలకు అల్టిమేటం జారీ చేసింది. మహిళలు కాలేజీల్లో తప్పనిసరిగా ముఖాన్ని కప్పుకోవాల్సిందేనని ఆదేశించింది.
ఇక కాలేజీలు విడిచిపెట్టే సమయం కూడా ఇద్దరికీ వేర్వేరుగా ఉండాలని… ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని ఒకరు కలవకూడదని స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఆ దేశానికి చెందిన ప్రొఫెసర్లు మాట్లాడుతూ… మహిళలను చదవుకునేందుకు ఒప్పుకోవటమే తాలిబన్లు చేస్తున్న మంచి అని, ఈ అంక్షలన్ని భరించాల్సిందేనంటూ నిట్టూర్చుతున్నారు.
در تصویر: دروس دانشگاه با پرده جدایی آغاز شد #آماج_نیوز pic.twitter.com/2we0oqRnbS
— Aamaj News (@AamajN) September 6, 2021
Advertisements