ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని కైవసం చేసుకునే పనిలో ఉన్న తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ పోతున్నారు. ఇప్పటికే 75 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా భారత ప్రధాని మోడీ ఆఫ్ఘాన్ కు బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్ ను కూడా తమ వశం చేసుకున్నారు.
కుందూజ్ ఎయిర్ పోర్టులో MI-35 హెలికాప్టర్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే హెలికాప్టర్ రోటర్ బ్లేడ్లు, కీలక విడిభాగాలు కనిపించలేదు. ముందు జాగ్రత్తగా ఆఫ్ఘాన్ సైన్యం వాటిని తొలగించినట్లు తెలుస్తోంది. 2019లో అక్కడి సైన్యానికి భారత్ ఈ హెలికాప్టర్ ను గిఫ్ట్ గా అందించింది. ప్రస్తుతం తాలిబన్లపై జరుగుతున్న పోరాటంలో కూడా దీన్ని వాడింది ఆఫ్ఘాన్ సైన్యం.