ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతుండగా, మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. టోలో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హషిమి మహిళలు మంత్రులు కాలేరని చెప్పారు. అది వాళ్ళ మేడలో ఏదో మోయలేని భారం మోపినట్లు ఫీల్ అవుతారని చెప్పాడు. ఇంకా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మహిళలు కేవలం పిల్లలకు జన్మనివ్వాలని అనడం సంచలనంగా మారింది.
మహిళల నిరసనల విషయంలో సయీద్ జెక్రుల్లా హషిమి మాట్లాడుతూ మహిళా నిరసనకారులు ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించలేరని అన్నారు. ఆఫ్ఘన్ మహిళలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తాలిబన్లకు వ్యతిరేకంగా వీధుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో తాలిబాన్ నుండి ఈ ప్రకటన వచ్చింది. ఈ వ్యాఖ్యలు తాలిబన్లు పాత పద్ధతిలోనే ఆఫ్ఘానిస్తాన్ ను పాలించొచ్చు అనే ఆందోళనను మరింతగా పెంచాయి. 1996 నుండి 2001 వరకు తాలిబన్ల పాలనలో మహిళలు పని చేయడానికి అనుమతి లేదు.
ఆఫ్ఘన్ మహిళలు కాబూల్‌లో కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని, అందులో ముఖ్యంగా పూషాధిక్యాన్ని నిరసన వ్యక్తం చేయగా, తాలిబన్లు మహిళా అసమ్మతిపై తాలిబన్లు ఉక్కుపాదం మోపుతూ నిరసనకారులను చెదరగొట్టడానికి కొరడాలు, కర్రలను ఉపయోగించడం మావో ఆందోళకర విషయం.