ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం పీక్స్ కు చేరింది. ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తామంటూనే తాలిబన్లు తీవ్ర ఆంక్షలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో శాంతియుతంగా ఆఫ్ఘన్ లు నిరసన తెలిపారు. ఆఫ్ఘన్ పై పాకిస్తాన్ పెత్తనాన్ని నిరసిస్తూ వారంతా రోడ్లపైకి వచ్చారు. దీన్ని మీడియా కవర్ చేస్తుండగానే తాలిబన్లు బుల్లెట్ల వర్షం కురిపించారు.
తాలిబన్ల అరాచకాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులను బంధించారు. తీవ్రంగా హింసించారు. వారిని చిత్రహింసలు పెట్టారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు, మేధావులు మండిపడుతున్నారు.