మారిపోయామంటూనే తాలిబాన్లు మళ్లీ మారణహోమం సృష్టిస్తున్నారు. ఆప్ఘనిస్థాన్ పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చాక తమ అసలు నైజాన్ని బయటపెడుతున్నారు. తాలిబాన్ల వికృతరూపం మళ్లీ విలయతాండవం చేస్తోంది. బుధవారం జలాలాబాద్‌లో నిరసనకు దిగిన ఆప్ఘాన్‌వాసులపై తాలిబాన్లు ప్రవర్తించిన తీరు మళ్లీ పాత రోజులను గుర్తుకుతెస్తోంది.
దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలపై ఆఫ్ఘాన్ జాతీ జెండాలే ఉండాలన్న డిమాండ్‌తో .. కొందరు ఆ జెండాలను చేతబట్టుకుని ప్రదర్శన నిర్వహించగా… అది సహించలేని తాలిబాన్లు వారిపై కాల్పులకు తెగబడ్డారు.దీంతో వారు చెల్లాచెదురైపోయారు. అయితే ఈ సంఘటనలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై కూడా తాలిబాన్లు పాశవికంగా ప్రవర్తించారు. వారిపై తీవ్రంగా కొట్టి హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు.. తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశాయి. అందులో ముగ్గురు జర్నలిస్టులు ఏడుస్తూ కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీబీసీ వరల్డ్ సర్వీస్ జర్నలిస్ట్ హఫీజుల్లా మరూఫ్ షేర్ చేశారు. “జలాలాబాద్ నిరసనను కవర్ చేసినందుకు ఇదీ ఫలితం. జర్నలిస్టులు ఏడుస్తోంటే నిజంగా హృదయ విదారకంగా ఉంది.ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు. జర్నలిజం నేరం కాదు“ అంటూ ఆయన అందులో రాసుకొచ్చారు.
It really heartbreaking to see journalists are crying-simply just for covering a protest in Jalalabad city. This is how journalists beaten up and are treated by the Taliban now in Afghanistan. Journalism is not crime. pic.twitter.com/H2bfMHUBfV
— Hafizullah Maroof (@HafizMaroof1) August 18, 2021
మరొక వీడియోలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇది కూడా జలాలాబాద్‌లోనే జరిగినట్టుగా చెబుతున్నారు. ఒక మహిళా జర్నలిస్టును తాలిబాన్లు విపరీతంగా కొడుతున్నట్టు అందులో స్పష్టం కనిపిస్తోంది. కాళ్లతో తన్నుతోంటే.. ఆమె నొప్పితో విలవిలలాడుతూ కనిపించింది. మరో వీడియోలో ఓ జర్నలిస్ట్ అనేకసార్లు చెంపదెబ్బ కొట్టారు. విదేశీ మీడియా కోసం పనిచేసినందుకు ఈ ఇద్దరిని తాలిబన్లు శిక్షించారని తెలుస్తోంది.
Plz raise your voice against these brutalities, Taliban are punishing the Journalist that worked with foreign media in Jalalabad.@UN @UNHumanRights@ashrafghani @ManzoorPashteen#AfghanLivesMatter pic.twitter.com/jUxZg6U70n
— آریانه دیدم (Pashteen) (@AryanaAfghan3) August 18, 2021
ఇదిలా ఉంటే ఆప్ఘాన్‌లోని మహిళల హక్కులను కాపాడతామని వారు వచ్చి ప్రభుత్వంలో చేరాలని కోరిన తాలిబాన్లే.. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రముఖ పాష్టో న్యూస్ యాంకర్ షబ్నం దావ్రాన్ ఆఫీసుకు వెళ్లగా.. తాలిబాన్లు ఆమెను తిరిగి పంపారు. ఆమె బుర్కా వేసుకుని, ఐడీ కార్డు చూపించినప్పటికీ.. వెళ్లిపోవాలని గదామాయించారు. “పాలన మారిపోయింది. ఇంటికి వెళ్ళు” అని వారు తనను బెదిరించినట్టుగా ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. అటు ఇటీవల మహిళల హక్కుల గురించి వాగ్దానాలు చేసిన తాలిబాన్లు.. కొన్ని గంటల వ్యవదిలోనే బుర్కా ధరించలేదని ఒక మహిళను కాల్చి చంపారు.
Taliban didn't allow my ex-colleague here in @TOLOnews and famous anchor of the State-owned @rtapashto Shabnam Dawran to start her work today.
" Despite wearing a hijab & carrying correct ID, I was told by Taliban: The regime has changed. Go home"#Afghanistan #Talban pic.twitter.com/rXK7LWvddX— Miraqa Popal (@MiraqaPopal) August 18, 2021
Advertisements
వాస్తవానికి రాయిటర్స్‌లో పనిచేసే భారతీయ జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీని కొన్ని వారాల క్రితం తాలిబాన్లు చంపారు. అయితే తమకు తెలియకుండా అది జరిగిపోయిందని వారు సమర్థించుకున్నారు. కానీ ప్రస్తుతం వారి వ్యవహారం చూస్తోంటే.. అతని గురించి తెలిసిన తర్వాతే చంపివేశారన్న వాదనలకు బలం చేకూరుతోంది.