ఆఫ్ఘనిస్తాన్ ను కమ్మేసిన తాలిబన్లు ప్రజల్ని పరుగులు పెట్టిస్తూ.. వారు మాత్రం పార్కులు, జిమ్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఎక్కే చెక్క గుర్రాలు, కార్లు ఎక్కి ఆడుకుంటున్నారు.
కొందరు తాలిబన్లు జిమ్ లో కసరత్తులు చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రెసిడెంట్ భవనంలో పరిస్థితి మరింత దారుణం.. ఒకప్పుడు ఇతర దేశాల ప్రధానులు కూర్చుని మంతనాలు జరిపిన కుర్చీల్లో తాలిబన్లు భోజనాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.