ఆప్ఘనిస్తాన్ లో మహిళల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూనే ఉంది. ఇప్పటికే మహిళలు చదువుకోని పరిస్థితులు ఏర్పడుతుండగా… ఇప్పుడు ఉద్యోగస్తులపై కూడా పడింది. మహిళా ఉద్యోగులను ఇంటికే పరిమితం చేసేలా తాలిబన్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖలో మహిళా ఉద్యోగులను విధుల నుండి తొలగించగా… ఇప్పుడు రాజధాని కాబూల్ లో మున్సిపల్ ఉద్యోగులను తొలగించారు. దాదాపు 3వేల మంది ఉద్యోగుల్లో మహిళలు 33శాతం మంది పనిచేస్తున్నారు. అయితే, ఇక నుండి వీరు విధులకు రాకూడదని… కేవలం పురుషులు చేయలేని పనుల్లో కొందర్నీ మాత్రమే అనుమతిస్తామన్నారు. టాయిలెట్స్ క్లీనింగ్ వంటి పనులకు మాత్రమే మహిళా ఉద్యోగుల సేవలను వాడుకోబోతున్నట్లు తెలిపారు.