అఫ్ఘన్ లో తాలిబన్లకు వ్యతిరేకంగా అక్కడి స్థానిక మహిళలు రోడ్డెక్కారు. ముఖ్యంగా అఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ జోక్యాన్ని వారంతా నిరసిస్తున్నారు. దాదాపు 100మంది అఫ్ఘన్ మహిళలు పాక్ కు వ్యతిరేకంగా పాక్ ఎంబసీ ముందు నిరసనలకు దిగారు. దీంతో అప్రమత్తమయిన తాలిబన్లు నిరసనలను అదుపు చేసేందుకు ఫైరింగ్ కు దిగారు.
నిరసనల సమయంలో డెత్ టూ పాకిస్తాన్, అజాదీ… అజాదీ అంటూ అఫ్ఘన్ లు నినాదాలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కొన్ని రోజులుగా పాక్ ఆర్మీ చీఫ్ తాలిబన్లతో చర్చలు జరపుతూ… అఫ్ఘన్ పాలనా వ్యవహరాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇక ఈ నిరసనలను కవర్ చేస్తున్న మీడియాపై కూడా తాలిబన్లు ఆంక్షలు విధించారు.