అఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆధిపత్యం కొనసాగుతుంది. కొన్ని రోజులుగా తాలిబన్లకు లొంగకుండా ప్రతిఘటిస్తున్న పంజ్ షీర్ సేనలపై తాలిబన్లు ఆధిపత్యం కనపర్చారు. పంజ్ షీర్ గవర్నర్ కార్యాలయాన్ని తాలిబన్లు వశపర్చుకున్నారు. ప్రతిఘటన సేనల తరఫున అధికారిక ప్రతినిధిగా ఉన్న మసూద్ కీలక అనుచరుడు ఫహీం దష్టిని తాలిబన్లు కాల్చి చంపారు.
పంజ్ షీర్ తమ వశం అయ్యిందని తాలిబన్లు అధికారికంగా ప్రకటించారు. పంజ్ షీర్ కోసం పోరాడుతున్న సలేహా ఇంటిని డ్రోన్ల సహయంతో తాలిబన్లు కూల్చివేశారు.
తాము పంజ్ షీర్ ప్రజలకు హామీ ఇస్తున్నాం… మీరు కూడా మా ప్రజలతో సమానమే. మీపై ఎలాంటి వివక్ష ఉండదు, పంజ్ షీర్ వ్యాలీ కూడా మాలో భాగమే అని తాలిబన్లు ప్రకటించారు.