ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో పరిస్థితులు రోజురోజుకి దిగజారుతున్న పరిస్థితి. తాలిబన్ల అకృత్యాలకు అక్కడి ప్రజలు దేశంలో ఉండాలి అంటే భయపడుతున్నారు. చాలా మంది ప్రజలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు తమ సొంత దేశానికి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. చాలా దేశాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే ప్రజలను తమ దేశంలో ఉంచడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు.
దేశవ్యాప్తంగా పరిస్థితులు క్రమంగా క్షీణిస్తూ రావడంతో అక్కడున్న ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లి పోయి బతికే పరిస్థితి ఉంది. ఇస్లామిక్ చట్టం పేరుతో అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు తాలిబాన్లు సిద్ధమవుతున్నారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఎవరైనా సరే తప్పు చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తామని తాలిబాన్లు ప్రకటిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా అయితే వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని చెబుతున్నారు.
తాజాగా తాలిబాన్ల నేత నూరుద్దీన్ సంచలన ప్రకటన చేశాడు ఆఫ్ఘనిస్తాన్ లో గతంలో తమ పాలనలో అమలు చేసిన శిక్షలను మళ్లీ అమలులోకి తీసుకు వస్తున్నట్టుగా చెప్పాడు. 1997 నాటి దోషుల కాళ్లు చేతులు నరకడం వంటి శిక్షలు ఇప్పుడు అమలులో ఉంటాయని ప్రకటించాడు. ఈ తరహా శిక్షలు అమలు చేసిన సమయంలో చాలా దేశాలు తమ వ్యతిరేకించారని కానీ ఇప్పుడు తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఖురాన్ ప్రకారమే చట్టాలు రూపొందించి ఉంటామని అన్నారు.