తెలుగు సినిమా సంగీత దర్శకుల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న పేరు తమన్. ముందు కాపీ చేస్తాడనే విమర్శలు వచ్చినా సరే ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు అతను అందిస్తున్న సంగీతం మాత్రం ఒక ఊపు ఊపుతుంది. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, అఖండ,గాడ్ ఫాదర్ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి.
అఖండ సినిమాలో సంగీతానికి అభిమానులకు పూనకాలు వచ్చాయి. అగ్ర హీరోలకు ఇప్పుడు తమన్ తప్పనిసరిగా మారిపోయాడు. ఈ క్రమంలో భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. తమన్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండటంతో కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. మొన్నటి వరకు కేవలం ఒక్కో సినిమాకి రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
ఇటీవల నుంచి ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు టాక్ నడుస్తుంది. ఇతర భాషల సినిమాలు అయితే తక్కువే తీసుకుంటున్నా తెలుగు సినిమాలు అయితే మాత్రం కోట్ల రూపాయలు అడుగుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబో సినిమాలో కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక రామ్, బోయపాటి కాంబో సినిమాకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నాడు.