హిట్ టాక్ రావడంతో భీమ్లా నాయక్ థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా భీమ్లా మేనియా కొనసాగుతోంది. సాధారణ ప్రేక్షకుడి నుంచి సెలెబ్రిటీల దాకా అంతా మూవీ సూపర్ అంటూ రియాక్ట్ అవుతున్నారు.
భీమ్లా నాయక్ చూసిన సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. థియేటర్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు.
థియేటర్ లో సినిమా ప్రదర్శితం అవుతున్న సమయంలో.. లాలా భీంలా సాంగ్ రాగానే తెర ముందున్న స్టేజ్ ఎక్కేశాడు తమన్. కాసేపు డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
పవన్, రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ.
#GalagalagalagalaLAAAAAALAAAAA !! 🧿♥️#BlockBusterBheemLaNayak 🧨🧨🧨🧨🧨
THIS IS FOR MY DEAR LEADER #POWERSTAR SHRI @PawanKalyan GAARU AND MY GENIUS DIR SHRI #Trivikram GAARU 🙌🏿💃💃💃💃💃
Hope U all like this 🎭🎭💃🎭🧿🧿🧿 pic.twitter.com/GIDqwNcofA
— thaman S (@MusicThaman) February 25, 2022