మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజువల్ స్పెషలిస్ట్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ఆర్సీ 15. ఇప్పటికే ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. క్యాస్ట్ అండ్ క్రూపై శంకర్ దృష్టి పెట్టాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఆచితూచి యాక్టర్లను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇప్పటికే మూవీలో నటిస్తున్నారంటూ.. డజను మందికిపైగా ప్రముఖ నటుల పేర్లు వినిపించాయి. అందులో చివరికి ఎవరు మిగులుతారో తెలియదు కానీ.. ఆసక్తి మాత్రం మరింత పెరిగిపోయింది. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్టేట్ ఒక్కటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
ఆర్సీ 15లో హీరోయిన్ తమన్నా కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె ఈ మూవీలో హీరోయిన్‌గా కాక.. విలన్ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఆమె నటించేందుకు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. తమన్నా గతంలోనే రామ్ చరణ్‌తో రచ్చ మూవీలో మెరిసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీలో కియారా అద్వానీని హీరోయిన్‌గా దాదాపుగా ఖరారు చేశారు.