ఎఫ్2 సినిమాలో హీరోలతో పాటు తమన్న కూడా నవ్వులు పూయించింది. నువ్వు మారిపోయావ్ వెంకీ అంటూ తమన్న చెప్పే డైలాగ్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎఫ్3లో కూడా మిల్కీబ్యూటీ తన హవా చూపించబోతోంది. మూవీలో మెహ్రీన్, సోనాల్ లాంటి మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ, పూజాహెగ్డే ఐటెంసాంగ్ ఉన్నప్పటికీ.. తమన్న మాత్రం తనకంటూ ఓ ప్రత్యేకత చూపించనుంది.
ఎఫ్3 కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. ఎఫ్ 2కు మించి హారిక పాత్రని అద్భుతంగా ఎఫ్3లో డిజైన్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎఫ్3 కథ మొత్తం హారిక పాత్ర చుట్టూనే తిరుగుతుందంట. నటనకి ఆస్కారం వున్న హారిక పాత్రలో తమన్నా నటన నెక్స్ట్ లెవల్ లో వుంటుందని యూనిట్ చెబుతోంది.
వెంకటేష్- తమన్న మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉండబోతున్నాయి. ”మన ఆశలే మన విలువలు” ఎఫ్3 లో హారిక పాత్ర ద్వారా తమన్న చెప్పిన క్యాచి డైలాగ్ ఇది. ఈ డైలాగ్ హారిక క్యారెక్టరైజేషన్ లో కీలకంగా వుంటుంది. ఆశలతో మేడలు కట్టే హారికకి సోనాల్ చౌహాన్ పాత్ర పరిచయంతో కథలో పెద్ద సర్ ప్రైజ్ రాబోతుంది. ఈ సర్ ప్రైజ్ సినిమాలో అద్భుతంగా ఉండబోతోంది.
తమన్నా కెరీర్ లోనే ఎఫ్ 3లో హారిక పాత్ర ది బెస్ట్ గా నిలవనుంది. ఎఫ్3 రిలీజ్ తర్వాత తన కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్తుందని, టర్నింగ్ పాయింట్ అవుతుందని తమన్న కూడా ఆశగా ఎదురుచూస్తోంది. ఈ నెలాఖరుకు థియేటర్లలోకి వస్తోంది ఎఫ్3 సినిమా.