కొన్ని చిన్న సినిమాలు మంచి కాన్సెప్ట్ తో వస్తాయి. కానీ సరైన ఆర్టిస్టులు లేక టెక్నీషియన్స్ సపోర్ట్ దొరక్క విజయాన్ని అందుకోవు. మరికొన్ని సినిమాల కోసం భారీ బడ్జెట్ పెడతారు, స్టార్ కాస్ట్ కూడా బాగుంటుంది. కానీ అందులో కొత్తదనం, కొత్త కాన్సెప్ట్ మచ్చుకు కూడా కనిపించదు. రెండూ మిక్స్ అయి వచ్చే సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి సినిమానే.
త్రిపర్ణ వెంకటేష్ అనే దర్శకుడు ఓ మంచి కథ రాసుకున్నాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ తో సూపర్ నేచురల్ పవర్స్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన కథ ఇది. నిజానికి ఈ కథను అనుష్కతో చేయాలని చాలా ట్రై చేశారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడీ కథ అటుఇటు తిరిగి తమన్న దగ్గరకు చేరింది. తమన్న ఇందులో నటించడానికి సూత్రప్రాయంగా ఒప్పుకుంది. కానీ ప్రాజెక్ట్ మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు.
కథ బాగుంది కానీ.. ఈ కథ తీసుకొచ్చిన దర్శకుడికి కేవలం ఒక్క సినిమా అనుభవం ఉంది. ఇక ఈ కథపై డబ్బు పెట్టడానికి వచ్చిన నిర్మాతలు కొత్తవాళ్లు. టాప్ టెక్నీషియన్స్ ఎంతమంది వచ్చి చేరతారో తెలీదు. అందుకే ప్రస్తుతానికి తమన్న ఈ సబ్జెక్ట్ ను హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ భారీ సినిమాను తెరకెక్కించడానికి అక్షరాలా 22 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేది ప్రాధమికంగా ఓ అంచనా. సెట్స్ పైకి వచ్చిన తర్వాత బడ్జెట్ మరో 2 కోట్లు అటుఇటుగా పెరగొచ్చని అంటున్నారు. కాన్సెప్ట్ మంచిదే కానీ, ఎంతమంది ఇందులో సెట్ అవుతారనేది చూడాలి.