యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
జైలర్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే జైలర్ సెట్స్ నుంచి విడుదలైన మోహన్ లాల్, సునిల్ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా బాటియా మరో కీలక పాత్రపోషిస్తోంది.
తాజాగా మేకర్స్ సెట్స్ నుంచి తమన్నా లుక్‌ను విడుదల చేశారు. తమన్నా స్టైలిష్ అండ్ గ్లామరస్ గా రివీల్ అయ్యింది.ఇంతకీ ఈ బ్యూటీ ఎలాంటి పాత్రలో కనిపించబోతుందనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది. మోహన్‌లాల్, సునిల్, తమన్నా లుక్స్ ను గమనిస్తే..డిఫరెంట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో ఈ ముగ్గురి పాత్రలూ ఉండబోతున్నాయని తెలుస్తోంది.
అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జైలర్‌లో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్నా మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023