అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిన తర్వాత.. ఆ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్3 తెరకెక్కింది. ఈ చిత్రం మే 27 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి.
ఇదిలా ఉంటే.. తమన్నా గ్లామర్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవపరం లేదు. తమ సినిమాల్లో గ్లామర్ తగ్గినట్టు ఏ మాత్రం అనుమానం ఉన్నా ముందుగా తమన్నానే పిలుసుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి తమన్నా ఉన్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం వేరే భామను పరిచయం చేసింది చిత్ర యూనిట్.
తాను ఉండగానే మరో అందాల భామను తీసుకొచ్చారని తమన్నా అలిగినట్టు టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమన్నా రాకపోవడంతో అది బలపడిందని అంటున్నారు. ఆమె బిజీగా ఉండటంతో రాలేకపోయిందని చిత్ర యూనిట్ చెప్పి కవర్ చేసినప్పటికీ.. ఇంతవరకూ ఆమె ఒక్క ఇంటర్వ్యూలోను కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తమన్నా అభిమానులు.
‘ఎఫ్ 2’ లో అందాల సందడి చేసిన తమన్నా.. ‘ఎఫ్ 3′ లోను తనదే పై చేయి అనుకున్న సమయంలో.. హఠాత్తుగా సోనాల్ చౌహాన్ ను రంగంలోకి దింపడంతో అలిగిందనే చర్చ సినీ పరిశ్రమలో జోరందుకుంది. అంతేకాకుండా ఎఫ్ 3’ లో చౌహాన్ కి ఒక కీలక పాత్రను ఇచ్చి అందాల సందడి చేయించారు. పోనీలే ఆమెతో నాకు పోటీ ఏంటి..? అని తమన్నా అనుకుంటే.. అంతటితో ఆగకుండా పూజ హెగ్డేను తీసుకొచ్చారు.
Advertisements
‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచన’ అన్నట్టు తన పాత్రను తగ్గించారనే అలకతోనే ఆమె ప్రమోషన్స్ కి రావడం మానేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇంతకు ఈ చర్చలపై అందాల భామ తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు అభిమానులు.