సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసిన వార్తల్లో నిలుస్తుంటారు. కొంచెం ఎక్కువగా కనిపిస్తే ఇంకా హాట్ టాపిక్ వాళ్ళే అవుతారు. వాళ్ళపై రకరకాల గాసిప్స్ మొదలవుతాయి. అయితే అలాంటి సంఘటనే ఒకటి తమన్నా జీవితం లో జరిగింది. తమన్నాతో పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో షాపింగ్ చేస్తున్న పాత ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దుబాయ్ లో ఓ బంగారం షాపు ప్రారంభోత్సవానికి వీరిద్దరూ ప్రముఖ అతిథులుగా వచ్చారు. ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకల సంబంధాలు కట్టేశారు.
అయితే ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూ లో తమన్నా క్లారిటీ ఇచ్చింది. తనకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు ఇవ్వని పుకార్లే అని ఆ వార్తలను కొట్టిపారేసింది. అయితే తమన్నా ప్రస్తుతం గోపిచంద్ హీరోగా వస్తున్న సీటిమార్ సినిమాలో తెలంగాణ కబడ్డీ జట్టుకు కోచ్ గా నటిస్తుంది.