ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కాలం అయినప్పటికీ తమన్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అగ్ర కథనాయికగా వెలుగొందుతున్న తమన్నా పరిశ్రమలోని అగ్ర హీరోలందరితో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. ఆమెను మిల్కీ బ్యూటీ అంటారు కూడా.
ఆమె అందాన్ని చూసి మైమరచిపోని అభిమానులు ఉండరు. తాజాగా తన అందాల రహస్యాన్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.ప్రతీరోజు గంధం, కాఫీ పొడి, తేనె కలిపి ముఖానికి రాసుకుంటానని తెలిపింది. దీంతో పాటు తన తల్లి చెప్పిన టిప్స్ పాటిస్తుంటానని తెలిపింది. ఈ బ్యూటీ టిప్ప్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం తన ప్రేమ గురించి చెప్పకుండ బ్యూటీ గురించి చెప్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. తమన్నా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది. ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
తాజాగా తమన్నా హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నారని, త్వరలో వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు వచ్చాయి. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం విడుదల చేయకపోగా.. అందాల చిట్కాలు చెబుతుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.