ప్రముఖ తమిళ కమెడియన్ మయిల్ స్వామి ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించారు. దీంతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కాగా మయిల్ స్వామి జీవితమే ఓ సినిమా అని చెప్పవచ్చు. ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇక్కడివరకూ వచ్చానని ఆయన పలుమార్లు చెబుతూ ఉండేవారు.
మయిల్ స్వామి 1965 అక్టోబర్ 2న జన్మించారు. చిన్ననాటి నుంచే మయిల్ స్వామి కళలతో ప్రయాణం మొదలు పెట్టారు. సినిమా రంగంలోకి రావడానికన్నా ముందు.. ఎన్నో నాటకాలను వేశారు.
స్టేజీ ప్రదర్శనలు ఇచ్చారు. కామెడీ బృందంతో తమిళనాడు మొత్తం తిరిగారు. అనంతరం టెలివిజన్ తెరపైకి ప్రవేశించారు. అక్కడ మంచి గుర్తింపు వచ్చాక, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
తనదైన కామెడీ టైమింగ్ తో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు వేశారు. స్టాండప్ కామెడీకి కూడా కేరాఫ్ గా నిలిచారు. ప్రస్తుతం ఆయన ‘అసతపోవతుయారు’ అనే కార్యక్రమానికి జడ్జిగా ఉన్నారు. ఈ విధంగా కమెడియన్ మయిల్ స్వామి జీవితమంతా నటన చుట్టూనే తిరిగింది.