శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్. ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ కాబోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అలాగే ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా లోని పాటలు తమిళంలో విడుదల అయ్యాయి. తెలుగులో త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇందులో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Advertisements
ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని… నవరసాలను ఇందులో శివ కార్తికేయన్ పండించారని చెప్పుకొచ్చారు నిర్మాతలు. కోటపాడి రాజేష్ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్ తో కలసి నిర్మించారు.