దేవతలా వైద్యసేవలందించాల్సిన నర్సు అత్యంత దారుణానికి ఒడిగట్టింది. వివాహేతర సంబంధాన్ని శాశ్వతమని భావించి కట్టుకున్న భర్తను హత్యచేసింది. ప్రియుడు, స్నేహితుల సహాయంతో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
అయితే పోలీసుల దర్యాప్తులో ఆమె దుర్మార్గం డొల్లతనం బయటపడ్డాయి. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిరుత్తన్నికి చెందిన 25 ఏళ్ల గాయత్రి నర్సుగా పని చేస్తున్నది. నర్సింగ్ కాలేజీలో చదివేటప్పుడు శ్రీనివాసన్ అనే వ్యక్తిని ప్రేమించింది.
వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే కుటుంబ సభ్యులు బంధువైన యువరాజ్‌తో ఆమెకు పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత కూడా గాయత్రి, శ్రీనివాసన్ తమ సంబంధాన్ని కొనసాగించారు.
కాగా, మన్నూర్‌పేటలోని కార్ యాక్ససరీస్ తయారీ యూనిట్‌లో పని చేసే 29 ఏళ్ల యువరాజ్‌కు ఇటీవల భార్య గాయత్రి వ్యవహారం గురించి తెలిసింది. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేయాలని ఆమె నిర్ణయించింది.
30 ఏళ్ల ప్రియుడు శ్రీనివాసన్‌తో కలిసి ప్లాన్ చేసింది. సోమవారం రాత్రి యువరాజ్ పని నుంచి ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆ ఇంట్లో దాగి ఉన్న శ్రీనివాసన్ వెనుక నుంచి దాడి చేశాడు. అతడ్ని పట్టుకుని మంచంపై పడేశాడు.
స్నేహితులైన 22 ఏళ్ళ హేమనాథన్, 28 ఏళ్ల మణికందన్ కలిసి యువరాజ్ కాళ్లు చేతులు గట్టిగా పట్టుకున్నారు. దీంతో గాయత్రి, శ్రీనివాసన్ కలిసి ఉపిరాడకుండా చేసి యువరాజ్‌ను హత్య చేశారు. అనంతరం అతడి మెడకు తాడు కట్టి సీలింగ్‌కు వేలాడ తీశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
మరోవైపు భర్త యువరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడని తన అత్తమామలకు గాయత్రి తెలిపింది. ఆ సమయంలో తాను నిద్రపోయినట్లు చెప్పింది. అయితే తన కుమారుడి మరణంపై యువరాజ్ తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. కోడలు గాయత్రి చెప్పిన దానిని ఆయన నమ్మలేదు. కుమారుడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, పోలీసులు యువరాజ్ మృతదేహాన్ని పరిశీలించారు. అతడి కాళ్లు, చేతులపై గాయాలు ఉండటాన్ని గమనించారు. యువరాజ్‌ది ఆత్మహత్య కాదని భావించారు. గాయత్రిని పోలీస్ స్టేషన్‌కు రప్పించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
చివరకు భర్తను హత్య చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. ప్రియుడు శ్రీనివాసన్, మరో ఇద్దరు స్నేహితులు సహకరించినట్లు వెల్లడించింది. దీంతో గాయత్రి, ఆమె ప్రియుడితోపాటు ఇద్దరు స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.