హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన 13 మంది జవానులకు తమిళనాడు ప్రజలు ఘన నివాళి అర్పించారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి అంబులెన్స్ భౌతికకాయాలను తీసుకెళ్తుండగా దారిపొడవునా నిలబడి, పూల వర్షం కురిపించారు. కాగా వారి పార్థివదేహాలను ఎయిర్ ఫోర్స్ C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ సూలూరు నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు.
తమిళనాడు సమీపంలో నిన్న జరిగిన ప్రమాదంలో 13 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ మృతి చెందారు.