శ్రీలంక తీవ్ర ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటి. సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జాఫ్నా యూనివర్సిటీని సందర్శించేందుకు రణిల్ విక్రమసింఘే వస్తున్నారని తెలుసుకున్న తమిళులు.. రోడ్లపై ఆందోళనకు దిగారు.
అధ్యక్షుడి పర్యటనను అడ్డుకోవడానికి యువకులు ఆందోళన ప్రారంభించారు.ఈ ఆందోళనను అణచివేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని, యువకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల సూచనలను ఆందోళనకారులు ఏమాత్రం పట్టించుకోలేదు.
దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ ప్రెజర్స్ ప్రయోగించి ఆందోళనకారులు ముందుకు రాకుండా అడ్డుకున్నారు. నీళ్లలో తడిసిన ఆందోళనకారులు కొంతమంది షాంపూలు తీసి తలంటుకుంటూ నిరసన వ్యక్తంచేశారు.
Protesters were seen throwing water mixed with cow dung at the security forces as they continued to clash in Nallur. pic.twitter.com/IUm8OQDomJ
— Tamil Guardian (@TamilGuardian) January 15, 2023