తమిళ నటుడు, మక్కళ్ నిధి మయం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కరోనా వైరస్ దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. గత వారం రోజులుగా తమిళనాడులోనూ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో… స్పందించిన కమల్ హసన్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నపం చేశాడు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వారికి చికిత్స అందించేందుకు తన ఇంటిని ఆసుపత్రిగా మార్చుకోవచ్చని ప్రభుత్వాన్ని కోరాడు. తాత్కాలికంగా కరోనా వైరస్ కేసులను చూసేందుకు తన ఇంటిని అప్పగిస్తామని, తమ పార్టీ కార్యకర్తలు కూడా డాక్టర్లతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నారని కమల్ హసన్ ట్వీట్ చేశాడు.
దీనిపై అక్కడి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.