వరుస సినిమాలతో రవితేజ మంచి జోష్ మీద ఉన్నాడు. ఒక పక్క డిస్కో రాజా సినిమా షూటింగ్ నడుస్తుండగానే మరో రెండు సినిమాలకు ఒప్పేసుకున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రవి తేజ మరో సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో విజయ్ నటించిన తేరి సినిమా కు రీమేక్ తో ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాలో రవి తేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.అయితే తాజా ఈ మూవీ టీమ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. తమిళ్ లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న సముద్రఖని ఈ సినిమాలో ముఖ్యపాత్ర లో నటించనున్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్నాయి. బలుపు హీరోయిన్ శృతిహాసన్ మరో సారి రవితేజ సరసన నటించనుంది.