డియర్ కామ్రేడ్ సినిమాతో డల్ అయిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ప్రస్తుతం నటిస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ మూవీ తర్వాత మళ్లీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే విజయ్ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అనౌన్స్ అయిన ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి ‘హీరో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డియర్ కామ్రేడ్ లాగే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న హీరోకి ఇప్పుడు ఒక కోలీవుడ్ హీరో నుంచి కొత్త చిక్కు వచ్చి పడింది.
కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, విశాల్ తో అభిమన్యుడు లాంటి హిట్ సినిమా తీసిన పీఎస్ మిత్రన్ కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కూడా హీరో అనే టైటిలే ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసిన మేకర్స్ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. శివ కార్తికేయన్ ప్రొమోషన్స్ కూడా మొదలుపెట్టడంతో ‘హీరో’ అనే టైటిల్ కోసం ఒక టాలీవుడ్ హీరో, ఒక కోలీవుడ్ హీరో పోటీ పడుతున్నట్లు అయ్యింది. నిజానికి ఈ వివాదం ఎప్పటి నుంచో ఉన్నా కూడా శివ కార్తికేయన్, రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ అనౌన్స్ చేయడంతో ఆ వివాదం మళ్లీ బయటకి వచ్చింది. చేతిలో ఒక సూపర్ మాస్క్ పట్టుకున్న శివ కార్తికేయన్ పోస్టర్ లో చాలా మ్యాన్లీ లుక్ లో కనిపిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ కూడా దీపావళికి బయటకి రానుంది. తమిళ సినిమాకి ఈ టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది, అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది కాబట్టి మన రౌడీ, హీరో టైటిల్ ను వడులుకుంటాడా లేక తెలుగులో అలానే ఉంచేసి తమిళ్ కి మాత్రమే టైటిల్ మార్చుకుంటాడా అనేది చూడాలి. ఈ రెండు మార్గాలు కాకుండా ‘హీరో’కి ముందు తన పేరు చేర్చి విజయ్ దేవరకొండ హీరో అని రిలీజ్ చేస్తాడా అనేది చూడాలి.