తన ప్రేమను ఒప్పుకోకుండా… తనతో పెళ్లికి నిరాకరిస్తుందన్న కోపంతో… బస్సులోనే తాళి కట్టేశాడు ఓ యువకుడు. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.
జగన్ అనే యువకుడు స్థానికంగా ఓ కాలేజీలో చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని ఆ యువతి ఎంత చెప్పినా అతడు వెంట పడటం మాత్రం మానలేదు. మరోవైపు ఆ అమ్మాయి తల్లితండ్రులు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. దీంతో విషయం తెలుసుకున్న జగన్… ఆ యువతిని వెంబడించి, బస్సులో ప్రయాణిస్తున్న టైంలో తాళి కట్టేశాడు.
దీంతో… ఆమె కేకలు వేయటంతో తోటి ప్రయాణికులు ఆ యువకున్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు.