ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్ధకుల ముందుకు రావటానికి వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో విజయ్ దళపతి హీరో రాబోతున్న మాస్టర్ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకి రానుంది. మొదట 50 శాతం ఆక్యుపెన్సీ తో రిలీజ్ కు సిద్ధం అయినప్పటికీ ఇచ్చినప్పటికీ 100 శాతం ఆక్యుపెన్సీ కి పెంచుతూ జనవరి 4న తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్రం మాత్రం 50 శాతం కొనసాగించాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.
అయితే థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ హెడ్ తిరుప్పురు సుబ్రహ్మణ్యం ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఒకవేళ తమిళనాడు ప్రభుత్వం 100% ఆక్యుపెన్సీ విషయంలో వెనక్కి తగ్గితే రాష్ట్రంలోని అన్ని థియేటర్లలోనూ మాస్టర్ సినిమా ప్రదర్శిస్తామని తమ తొలి ప్రాధాన్యం విజయ్ సినిమా అని స్పష్టం చేశారు.