తెలుగు ఇండస్ట్రీ కి తలమానికంగా ఉన్న చిరంజీవి లాంటి అలా చేయడం తనకు నచ్చలేదన్నారు తమ్మారెడ్డి భరద్వాజ . ఆయన వెంట వెళ్లిన వాళ్లు కూడా మామూలు వాళ్ళు కాదని ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వంటి వారు వెళ్లినా కూడా అడుక్కునే పరిస్థితి భాధగా ఉందన్నారు.
మొదట పెద్ద మనిషి పాత్రలో వెళ్లి సమస్య తీర్చి నందుకు చిరంజీవి గారికి ధన్యవాదాలు అని చెబుతూనే అలా అడుక్కున్న విధంగా కోరడం తనకు ఏమాత్రం నచ్చలేదని అన్నారు తమ్మారెడ్డి.
ఇది ఇప్పటికే చిరంజీవి అలా ప్రాధేయ పడుతూ అడగడంను తప్పు తప్పు పడుతున్నారు చాలామంది సినీ నటులు. ఆర్జివి కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే విషయమై ట్వీట్ చేశారు.