మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ రాజ్యసభ సీటు చింరంజీవికి ఇవ్వబోతున్నారని సోషల్ మీడియా లో అందరు చర్చించుకుంటున్నారు. మరో వైపు దాసరి నారాయణరావు స్థానాన్ని చిరంజీవి ఆశిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా వస్తున్న ఈ వార్తలపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. చిరంజీవి అనుకోవాలే కానీ ఆయనకు ఏ ప్లేస్ కూడా పెద్దది కాదన్నారు తమ్మారెడ్డి. దాసరి నారాయణ రావు పొజిషన్ అస్సలు అధికారికం కాదని ఆయన ఒక పెద్దమనిషిలా వ్యవహరించేవారన్నారు. పదవి కోసం జగన్ దగ్గరకు చిరంజీవి వెళ్లినట్టు ప్రచారం చెయ్యటం ఆశ్చర్యానికి గురించేసిందన్నారు.