తెలంగాణలో మునుగోడు బై ఎలక్షన్స్ కాకరేపుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ విస్తృత ప్రచారాలు నిర్వహిస్తూనే.. ప్రత్యర్థులపై మాటల తూటాలను పేల్చుతున్నారు. తాజాగా ఈ ఉప ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. లేటెస్ట్ గా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్, జగదీష్ రెడ్డిలను మీడియా ఎదురుగా ప్రశ్నించారు. మునుగోడు బై ఎలక్షన్స్ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కి కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కమ్యూనిస్టులకు చెప్పుకోదగిన ఓటింగ్ ఉండటంతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని ఓడించాలంటే.. టీఆర్ఎస్ కే సాధ్యం. అందుకే తమ మద్దతు గులాబీ పార్టీకేనని ప్రకటించాయి సీపీఐ, సీపీఎం.
అయితే మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక విషయంలో చేసిన కామెంట్లను తప్పుబట్టారు తమ్మినేని వీరభద్రం. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.18 వేల కోట్ల నిధులు ఇస్తే ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు తమ్మినేని. నిధులు ఇస్తే అనే మాటలు.. బీజేపీతో లూజ్ నెస్ ఉంటుంది అనే భావన వస్తుందన్నారు తమ్మినేని వీర భద్రం.
బలహీనత మాటల్లో కనపడుతుందన్నారు. దానిని మేము తీవ్రంగా తప్పుపడుతున్నామని ఆయన అసహనం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి అంటే ఏదో అన్నారులే అనుకోవచ్చు. కేటీఆర్ కూడా అలాంటి మాటలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. నిధులు ఇస్తే మీ వైఖరి మార్చుకుంటారా? అని నిలదీశారు తమ్మినేని. ఇక లెఫ్ట్ పార్టీలు కలిసి పని చేయాలనే ఉమ్మడి సమావేశం నిర్వహించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పని చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ తో కలవాలని కానీ.. వద్దు అనే భావన కానీ మాకు లేదనన్నారు. కానీ అప్పటి పరిస్థితికనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇక మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమ్యునిస్టులపై అనేక అఘాయిత్యాలు చేశారని మండిపడ్డారు సీపీఎం తెలంగాణ చీఫ్ కుద్రపూజలు, మను ధర్మం.. చరిత్ర మార్పు చేయడం మొదలు పెట్టింది బీజేపీయేనన్నారు. కేసీఆర్ పూజలు, యాగాలు చేస్తారు అంతే. కానీ బీజేపీలా కాదన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండగానే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు తమ్మినేని. టీఆర్ఎస్ అభ్యర్థి కోసం కృషి చేస్తున్నారు. వారికి మద్దతుగా ప్రచారం చేస్తూనే.. వారు గీత దాటి మాట్లాడే కామెంట్స్ ని మాత్రం తప్పుబడుతున్నారు కామ్రెడ్స్. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పాటు సీపీఎం, సీపీఐ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.