దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన చిత్రం ఝుమ్మంది నాదం. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తాప్సి పరిచయమైంది. ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ లో వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది. ఇటీవల జైపూర్ లో ఓ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉండగా తాజాగా గ్రామర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో దర్శకులు బికినీ వేసుకోమని చెప్పేవారని మొహమాటం లేకుండా ఓకే చెప్పేదానని తెలిపింది. కానీ వ్యక్తిగతంగా ఇష్టం ఉండేది కాదని చెప్పుకొచ్చింది. అందంగా కనిపించాలంటే స్కిన్ షో చేయడం కాదని నా అభిప్రాయం. నన్ను బికినీలో చూడడానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడేవారు కాదనిపించేది అంటూ చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే బికినీ నాకు కూడా సౌకర్యంగా ఉండదు అంటూ చెప్పుకొచ్చింది.