బాలీవుడ్ లో తానేంటో నిరూపించుకున్న హీరోయిన్ తాప్సీ. ముఖ్యంగా లేడీ ఓరియేంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. తాప్సి ఇప్పుడు ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చాలాకాలం తర్వాత తాప్సీ తెలుగు సినిమా చేయనున్నారు.
డైరెక్టర్ తేజ రూపోందిస్తున్న అలివేలు వెంకటరమణ సినిమాలో తాప్సీకి ఛాన్స్ దక్కింది. ఈ సినిమాలో హీరోగా గోపిచంద్ నటిస్తాడని ముందుగా ప్రచారం జరిగినా… గోపిచంద్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవటంతో తమిళ్ యంగ్ హీరోను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
హీరోయిన్ గా తాప్సీ కన్నా ముందు కాజల్ ను అనుకున్నప్పటికీ తేజ తాప్సీ వైపే మొగ్గుచూపారు. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తికాగా, పీపుల్స్ మీడియా ఫాక్టరీ సినిమాను తెరకెక్కించనుంది.