ఉంటున్న ఇంటిని, అందులోని గదులను అందంగా తీర్చిదిద్దుకోవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. అయితే నటి తాప్సీ అందుకుగాను కొద్దిగా ఎక్కువగానే శ్రమ పడుతోంది. స్వతహాగా కళాప్రియురాలైన తాప్సీ తన ఇంటిని, అందులోని గదులను అందంగా తీర్చిదిద్దుకునేందుకు గత కొద్ది రోజులుగా శ్రమిస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా తన ఇంట్లో చేపట్టిన అలంకరణల తాలూకు ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాప్సీ తన ఇంట్లోని బెడ్‌రూంలో ఉన్న నాలుగు గోడల వుడెన్ బెడ్, గోడలపై అమర్చిన కళాకృతులు, వాల్ పోస్టర్లకు చెందిన ఫొటోలను తన సోషల్ ఖాతాలో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రాంలో వాటిని పోస్ట్ చేసింది. గోడమీద ఇత్తడి సైకిల్, ప్లేట్లను అందంగా అమర్చి వాటిని ఫొటోలు తీసి షేర్ చేసింది. సైకిల్‌ను కింద పెట్టడం మామూలే.. అందుకనే అవి గోడ మీద ఉన్నాయి.. అని అర్థం వచ్చేలా ఆ ఫొటోలకు కాప్షన్ పెట్టింది.
ఇక గోడలమీద ఆర్ట్, పెయింట్ వర్క్ చేయించిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. అవి వర్లి ఆర్ట్‌కు చెందిన చిత్రాలు కావడం విశేషం. నా ఇల్లు నాకు ఒక కథ చెబుతుంది.. అని ఆ ఫొటోలకు ఆమె కాప్షన్ పెట్టింది. వాటిని #WarliArt #PannuHouse హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేసింది.
Advertisements
కాగా నాలుగు గోడల మాదిరిగా ఉన్న బెడ్‌కు రెండు మెట్లు కూడా ఉన్నాయి. ఆ ఫొటోకు ఆమె.. రిలాక్స్‌గా ఉండాలంటే ముందు కష్టపడాలి.. అని కాప్షన్ పెట్టింది. అయితే ఇంట్లో ఎన్ని అలంకరణలు చేసినా, ఇంటిని ఎంత అందంగా ముస్తాబు చేసినా.. కుటుంబ సభ్యులతో కలిసి అందులో ఉంటేనే అసలైన ఆనందం లభిస్తుందని కూడా ఆమె కామెంట్ చేసింది.
ఇక తాప్సీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేస్తోంది. కరోనా లాక్‌డౌన్ అనంతరం రష్మి రాకెట్ అనే మూవీ షూటింగ్‌ను ఆమె పూర్తి చేసింది. అలాగే లూప్ లపెటా అనే మూవీలో ఆమె నటిస్తోంది.