బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, తారా సుతారియాల హీరో పంతి-2 సినిమా విడుదల సిద్దంగా ఉంది.ఈ సినిమాకు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించి రెండు వారాల క్రితం ట్రైలర్ రిలీజ్ అయింది.
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాలో నటించిన వీరిద్దరూ మరోసారి కలిసి ఆన్ స్క్రీన్ పై కనిపించనుండటంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
ఇక సినిమాలోని మిస్ హైరెన్ పాటను ఇటీవల విడుల చేశారు. ఈ కార్యక్రమానికి నటీనటులతో పాటు డైరెక్టర్ అహ్మద్ ఖాన్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తారా సుతారియా లావెండర్ డ్రెస్ లో మెస్మరైజ్ చేశారు. త్రీ-పీస్ లావెండర్ కో-ఆర్డ్ సెట్‌లో కనిపించిన తారా కుర్రాళ్లలో హీట్ పెంచేసింది.
కండ్లకు మస్కారా అప్లై చేసి కుర్రాళ్లను చూపులతో చంపేసింది. పెదవులపై గ్లాసీ పింక్ లిప్ స్టిక్, హెయిర్ ను అలా గాలిలోకి ఫ్రీగా వదిలింది. లావెండర్ డ్రెస్ విత్ అట్రాక్టివ్ మేకప్ లో ఆమెను చూసిన కుర్రాళ్ల మతులు పోయాయి.