యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం టెక్సాస్‌కి చెందిన ఓ అభిమాని 75 ఆర్‌ఆర్‌ఆర్ టిక్కెట్‌లు కొని తారక్‌పై తన ప్రేమను చాటుకో, ఫ్లోరిడాలో మొత్తం థియేటర్‌ను కొనుగోలు చేశారు కొంత మంది అభిమానులు.
ఫ్లోరిడాలోని సినిమార్క్ టిన్‌సెల్‌టౌన్‌లో సాయంత్రం షోల కోసం ఉన్న టికెట్స్ అన్నీ కొనుగోలు చేశారు. వీరంతా RRR సినిమాకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాను ఊహించలేని స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తుంది. SS రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమా మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదల అయిన లుక్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలియాభట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.