తారకరత్న మరణవార్త యావత్ తెలుగు ప్రజలను కలచివేస్తుంది. తారక్ హఠాత్తు మరణంతో అతని భార్య, పిల్లలు తల్లిడిల్లి పోతున్నారు. ప్రత్యర్థుల చేత కూడా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు తారకరత్న. అయితే కన్న కొడుకు మృతదేహాన్ని చూసేందుకు మోకిళ్లకు కూడా రాలేదు ఆయన పేరెంట్స్.
బాబాయ్ బాలయ్యనే చిన తండ్రి హోదాలో నిలబడి తారకరత్న అంత్యక్రియల కార్యక్రమాలను చూసుకుంటున్నాడు. కాగా సోమవారం అభిమానుల సందర్శనార్థం తారకరత్న మృతదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచారు. ఇక్కడికి వచ్చిన తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, శాంతి మోహన్ కన్న కొడుకు భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు.
కడసారి కొడుకుని చూసిన పేరెంట్స్ గుండె పగిలేలా ఏడ్చిన దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.