నందమూరి తారకరత్న పెద్దకర్మ హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. జనవరి 26న నారా లోకేష్ మొదలు పెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడ కుప్పకూలిపోయారు.
కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్నఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో అటు అభిమానులు, ఇటు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కాగా ఈరోజు పెద్ద కర్మ కార్యక్రమాన్ని నందమూరి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు తారకరత్నకు భావోద్వేగ అంజలి ఘటించారు.
తారకరత్న చిత్రపటం ముందు శిరసు వచ్చి నివాళి అర్పించారు. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందరేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు.