సీనియర్ ఎన్టీఆర్ మనవడు. విభిన్న నటుడు తారకరత్న గుండెపోటుతో కుప్పకూలడం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు లోని నారాయణ హృదయాలయ ఆపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
అత్యాధునిక పరికరాల తో డాక్టర్లు తారకరత్న తమ శక్తివంచన లేకుండా చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిన తరవాత 45 నిమిషాల పాటు గుండె పనిచేయడం ఆగిపోయింది.స్కాన్ చేయగా..మొదడు ముందు బాగం వాపు గా ఉన్నట్టు గుర్తించారు.
మెదడు లో నీరు చేరడం వలనే అలా జరిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరూ పరిస్థితి మెరుగు పడలేదు సరికదా, నానాటికీ దిగజారుతూ వస్తోంది. ఈ పరిస్థి అటు కుటుంబ సభ్యలను, ఇటు నందమూరి ఫ్యామిలీ అభిమానులనూ కలవర పెడుతోంది.
ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తరలించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఉన్న ప్రతీ అవకాశాన్నీ ఉపయోగించుకోవడం ద్వారా తారకరత్నను మామూలు మనిషిగా చేసుకునేందుకు కుటుంబ సభ్యులు తీవ్రకుషిచేస్తున్నారు. వారి ప్రయత్నం సఫలమవుతుందని అభిమాను ధీమావ్యక్తం చేస్తున్నారు.