జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో నందమూరి తారకరత్న అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తండ్రి మోహన కృష్ణ తారకరత్నకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాలకృష్ణ, నందమూరి సోదరులు తారక్ పాడె మోసారు.
అంతిమ సంస్కారాలకు ఎంపీ విజయ్ సాయి రెడ్డి, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం దిశగా సాగిన తారకరత్న అంతిమ యాత్రలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చివరిసారిగా ఆయన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.
కాగా నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు.
దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.