తెలుగుదేశం పునర్వైభవం కోసం, యువ నాయకుడిగా వ్యక్తిగత ప్రాధాన్యత కోసం నారాలోకేశ్ చేపట్టిన పాదయాత్ర యువగళం. అయితే ప్రారంభించిన మొదటి రోజే నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారు. టీడీపీ నేతలు అభిమానులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి చేర్పించిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
అయితే హాస్పిటల్లో చేర్పించి పదిరోజులు పైన కావస్తున్నా ఇప్పటివరకు తారకరత్నకు నయం కాకపోవడంతో నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే హెల్త్ కండిషన్ బాగానే ఉందని ట్రీట్మెంట్ కు కూడా తారకరత్న.. స్పందిస్తున్నాడని ఓ వైపు వైద్యులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే మెరుగైన వైద్యం కోసం తారకరత్నను విదేశాలకు తరలించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో తారకరత్న వైద్య ఖర్చు గురించి ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కోటి రూపాయలకు పైగా హాస్పిటల్ ఖర్చులు అయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ ఖర్చులను స్వయంగా నారాలోకేష్ భరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ తారకరత్న కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారట.
ఎంత ఖర్చు అయినా ఆయన పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చే వరకు తమ బాధ్యతే అని మాటిచ్చినట్లు తెలుస్తోంది. తారకరత్నకు చికిత్స జరుగుతోన్న ఆస్పత్రిలోనే ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, తండ్రి మోహనకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యంపై ఆరాతీస్తూనే ఉన్నారు.
Also Read: కే.విశ్వనాథ్ షూటింగ్స్ లో ఖాకీచొక్కా ఎందుకు వేసేవారంటే …!?