నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. తారకరత్నకు చికిత్స అందిస్తున్న నారాయణ హృదయాలయ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అందులో పూర్తిగా వెంటిలేటర్ సపోర్టుతో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. కుప్పంలో లోకేష్ పాదయాత్ర కోసం వచ్చిన తారకరత్న కార్యక్రమంలోనే కుప్పకూలిపోయారు.
వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటుకు గురైనట్లు గుర్తించారు. వెంటనే యాంజియోగ్రామ్ చేశారు. గుండెలోని ఎడమవైపు బ్లాక్స్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండడంతో స్టంట్ ఏర్పాటు వాయిదా వేశారు. బెంగుళూరు నుంచి నారాయణ హృదయాలయ వైద్యులు కుప్పం ఆస్పత్రిలో తారకరత్నను పరిశీలించారు.
ఇక ప్రత్యేకంగా రెంబు అంబులెన్సులో బెంగుళూరులో నారాయణ హృదయాలయకు అర్థరాత్రి వైద్యుల సాయంతో తరలించారు. అక్కడ తారకరత్నకు అన్ని పరీక్షలు చేశారు. బెలూన్ యాంజియోప్లాస్టీ చేసినట్లుగా కుప్పం వైద్యులు వెల్లడించారు. ఇక బెంగుళూరు ఆసుపత్రిలో ప్రస్తుతం పూర్తిగా రెస్పిరేటరీ సపోర్టింగ్ సిస్టమ్ తో చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే తారకరత్న పరిస్థితి అత్యంత విషయంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. వైద్య ప్రోటోకాల్ ప్రకారం నిపుణులైన టీం తారకరత్నకు చికిత్స అందిస్తుందని వెల్లడించారు.
నేడు బెంగళూరు నారాయణ హృదయాలయకు జూ. ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్.. ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. అయితే తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించి వ్యాధి. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది. శరీరంలో రక్త స్థాయిలు తగ్గిపోయి బలహీనంగా మారిపోతారు. ఇక క్రమంగా ఇది అనిమీయాకు దారితీస్తుంది. అలాగే శరీరం రంగు మారడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు తెలిపారు.