అటు రాజకీయ రంగంలో ఇటు సినీ రంగంలో తారకరత్న ఆరోగ్యం హాట్ టాపిక్ గా మారింది. తారక రత్న ఆరోగ్యం విషమించింది అని తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులు అందరూ ఆయన్ను చూడటానికి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్ళారు. బాలకృష్ణ ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నారు. అటు చంద్రబాబు సైతం తన కార్యక్రమాలను రద్దు చేసుకుని మరీ వెళ్ళారు.
అసలు తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి సరైన క్లారిటీ రావడం లేదనే టాక్ కూడా ఉంది. ఎక్మో పెట్టారనే వార్తలు వచ్చినా సరే అది నిజం కాదని ఆస్పత్రి ప్రకటించింది. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఇదిలా ఉంచితే తారకరత్న వివాహం చేసుకున్న అలేఖ్య గురించి చాలా మందికి తెలియదు. అసలు ఆమె ఎవరు, ఏంటీ అనేది చూద్దాం.
2012 లో తారకరత్న ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నందమూరి కుటుంబం మొత్తం కూడా ఈ వివాహాన్ని తప్పుబట్టింది. వద్దని చెప్పినా సరే వినకుండా తారకరత్న వివాహం చేసుకున్నారట. ఆమె విజయసాయి రెడ్డి మరదలి కుమార్తె. అయితే ఆమెకు అప్పటికే వివాహం జరిగింది. టిడిపి మాజీ మాజీ మంత్రి ఎలిమిరెడ్డి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. ఆ తర్వాత ఆమె తారకరత్నను వివాహం చేసుకున్నారు.
Also Read: సుజిత్ సినిమాకు పవన్ రెమ్యునరేషన్ తెలుసా…?