చైనా సైనికుల చేతుల్లో తాను చిత్రహింసలకు గురైనట్టు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన బాలుడు మిరమ్ తరోన్ చెప్పాడు. గత నెల 18న అరుణాచల్ చైనా సరిహద్దుల్లో మూలికల సేకరణకు వెళ్లాడు తరోన్. అక్కడ అతన్ని గమనించిన చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు.. అతన్ని నిర్బంధించారు. అతను తాజాగా సంచలన విషయాలను బయటపెట్టాడు.
అయితే.. భారత సైన్యం చేసిన సంప్రదింపులు ఫలించడంతో జనవరి 27న బాలుడ్ని చైనా సైన్యం అప్పగించింది. ఈ నేపథ్యంలో మిరమ్ తరోన్ చైనా సైనికులతో గడిపిన క్షణాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నాడు. మొదటి రోజు చైనా సైనికులు తన చేతులను తాళ్లతో కట్టి అడవుల్లోకి తీసుకెళ్లారని చెప్పాడు.
మొఖానికి గుడ్డను కట్టి అక్కడి నుంచి ఆర్మీ క్యాంప్ కు తీసుకెళ్లారని తెలిపాడు. తనను నానా రకాలుగా హింసించారని ఆరోపించాడు. తనను కొట్టడంతోపాటు కాకుండా ఎలక్ట్రిక్ షాక్ లు ఇచ్చారని ఆ బాలుడు చెప్పాడు.
Advertisements
కానీ.. ఇవన్నీ ఒక్క మొదటి రోజు మాత్రమే చేశారని అన్నాడు. రెండో రోజు నుంచి తనను హింసించలేదని.. తనకు కావలసిన ఆహారాన్ని అందించారని చెప్పాడు తరోన్.