తన ప్రతిష్టాత్మక 75వ చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు వెంకటేశ్. శైలేష్ కొలను దర్శకత్వంలో మూవీకి ఓకే చెప్పాడు. ఈ రోజు ఆ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. బుధవారం మరిన్ని వివరాలు రాబోతున్నాయి.
అయితే ఈ క్రమంలో మరో దర్శకుడికి హ్యాండ్ ఇచ్చాడు వెంకటేష్. అతడే తరుణ్ భాస్కర్. లెక్కప్రకారం, వెంకీ 75వ సినిమాకు ఇతడే దర్శకుడు. వెంకీతో చాన్నాళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు ఈ డైరక్టర్. 2-3 స్టోరీలైన్స్ కూడా నెరేట్ చేశాడు.
తను వినిపించిన కథల్లోంచి ఏదో ఒక లైన్ కు వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని తరుణ్ భాస్కర్ భావించాడు. అలా వెంకీ ప్రతిష్టాత్మక 75వ సినిమాకు దర్శకత్వం వహించొచ్చని భావించాడు.
కానీ పించ్ హిట్టర్ లా ఆఖరి నిమిషంలో ఎంటరైన శైలేష్ కొలను, మంచి యాక్షన్ స్టోరీతో వెంకీని మెప్పించాడు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. అలా వెంకీ ప్రతిష్టాత్మక సినిమాను డైరక్ట్ చేసే అవకాశం మిస్సయ్యాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఈ దర్శకుడు, కీడా కోలా అనే హారర్ సినిమా చేస్తున్నాడు.