విజయభాస్కర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 2000 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.
ఇందులో ఆర్తీ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజు, చంద్రమోహన్, సుహాసిని, సునీల్, బ్రహ్మానందం, హేమ, ఎమ్మెస్ నారాయణ, పింకీ, పృద్వి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హీరో హీరోయిన్ల మధ్య జరిగే లవ్ డ్రామా, బ్రహ్మానందం కామెడీ టైమింగ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మరోవైపు దర్శకుడు కోటి అందించిన సంగీతం సినిమాకు ప్లస్ గా నిలిచింది.
ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ లోనే బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా చూసిన చాలా మంది వెంకటేష్ తప్ప మరెవరూ ఈ సినిమాలో నటించలేరు అన్న విధంగా నటించారు వెంకీ. ఇదిలా ఉండగా ఈ సినిమాకు మొదట వేరే హీరోను అనుకున్నాడట దర్శకుడు విజయభాస్కర్.
ఆ నందమూరి స్టార్ హీరో గుర్తున్నాడా ? చిరంజీవితో అప్పట్లోనే మల్టీస్టారర్ !!
ఇదే విషయాన్ని చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట నువ్వే కావాలి చిత్రంతో హిట్ కొట్టిన తరుణ్ ను నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో చేయాలని అడిగాడట. కానీ డేట్లు కుదరట్లేదు అని చెప్పి పక్కకు తప్పుకున్నాడట. దీంతో త్రివిక్రమ్ వెంకటేష్ పేరును తెరపైకి తీసుకురావడంతో డైరెక్టర్ వెంకటేష్ ను ఫైనల్ చేశాడట.
Advertisements
అప్పట్లో ఈ సినిమా కోసం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ ను పెట్టగా… 18 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. అత్యధిక సెంటర్లలో 100 రోజులు మరియు 50 రోజులు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈచిత్రం రికార్డులకెక్కింది. ఈ సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న తరుణ్ నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, అదృష్టం వంటి చిత్రాలలో నటించాడు. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను చిత్రాలు మంచి హిట్ గా నిలిచాయి అదృష్టం మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
ఆ తర్వాత పదికి పైగా సినిమాలలో నటించిన తరుణ్ హీరో గా నిలదొక్కుకోలేకపోయాడు. ఇప్పటికీ కూడా తరుణ్ సినిమాలకు దూరంగానే ఉన్నాడు.