బాహ్యబల ప్రమేయం లేకుండా గమనంలో ఉన్న వస్తువు గమనంలోనూ.. జడత్వంలో ఉన్న వస్తువు జడత్వంలోనూ ఉండడానికే ప్రయత్నిస్తుంది. ఇది న్యూటన్ రెండో గమన నియమం.
అంటే కదిలే వస్తువు ఆగాలన్నా..ఆగిన వస్తువు కదలాలన్నా బైటనుంచి బలం ఉపయోగించాలన్న మాట. మరి ఆగి ఉన్న వస్తువు దానంతట అదే కదిలిందంటే ఏం అర్థం చేసుకోవాలి. ఆగి ఉన్న ట్రాక్టర్ దానంతట అదే స్టార్ట్ అయ్యి ముందుకు కదిలింది.
ముందున్న సైకిల్, బైక్ మీదుగా వెళ్లింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న షాపులోకి ఆ ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో ఆ షాపులోని వ్యక్తులు భయాందోళన చెందారు. టార్జన్ ట్రాక్టర్ గా దానిని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ సంఘటన జరిగింది.
ఒక స్టోర్ బయట పలు వాహనాలు నిలిచి ఉన్నాయి. అక్కడ నిలిచి ఉన్న ఒక ట్రాక్టర్ ఉన్నట్టుండి దానికదే స్టార్ట్ అయ్యింది. ఇంజిన్ స్టార్ట్ కావడంతో ఆ ట్రాకర్ట్ ముందుకు కదిలింది. దాని ముందున్న ఒక సైకిల్, బైక్‌ను తోసుకుని, తొక్కుకుని స్టోర్ ఎంట్రన్స్ వద్దకు వచ్చింది.
అక్కడ ఉన్న గ్లాస్ ఎంట్రన్‌్నను ఢీకొట్టింది. దీంతో స్టోర్లోని క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న వ్యక్తి భయాందోళన చెందాడు. వెంటనే స్టోర్ బయటకు పరుగెత్తాడు. డ్రైవర్ సీటులో ఎవరూ లేకపోవడం చూసి మరింత ఆశ్చర్యపోయాడు. ఏం చేయాలో అతడికి తోచక కంగారు పడ్డాడు.
కాగా, ఇంజిన్ ఆన్‌లో ఉన్న ఆ ట్రాక్టర్, గ్లాస్ ఎంట్రన్స్ మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించింది. కొంతసేపటికి ఆ గాజు ప్రవేశ భాగం పగిలిపోయింది. అంతలో ఆ స్టోర్ లోపల ఉన్న కొందరు వ్యక్తులు పరుగున ఆ ట్రాక్టర్ వద్దకు వచ్చారు. దాని ఇంజిన్ ఆపేందుకు ప్రయత్నించారు.చివరకు ఒక వ్యక్తి వైర్లు కట్ చేయడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆగిపోయింది.
అయితే ఈ సంఘటనలో స్టోర్ ముందు భాగం ధ్వంసమైంది. మరోవైపు ట్రాక్టర్ దానికదే స్టార్ కావడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. 1983లో విడుదలైన హాలివుడ్ మూవీ ‘క్రిస్టిన్’, దాని ఆధారంగా 2004లో తీసిన హిందీ సినిమా ‘టార్జాన్: ది వండర్ కార్’తో ఈ ట్రాక్టర్‌ను పోల్చారు.
ఆ స్టోర్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ను ప్రీతీ పాండే భరద్వాజ్ అనే యూజర్ ట్విట్టర్‌లో శుక్రవారం పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. ఆ ట్రాక్టర్ దానికదే ఎలా స్టార్ట్ అయ్యింది అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఘోస్ట్ (దెయ్యం) ట్రాక్టర్ అని కొందరు పేర్కొన్నారు
#Tarzan #tractor #bijnaur #CCTV #बिजनौर में जब बिना चालक के अचानक चल पड़ा ट्रैक्टर pic.twitter.com/MCl6RK3ORE
— Preety Pandey Bhardwaj (@prreeti1) March 3, 2023