వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడు వేర్వేరు సంఘటనల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 11మంది నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు 32 లక్షల విలువైన 318 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, మూడు ఆటోలు, 11 సెలఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు చూసుకుంటే…వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేసిన నిందితులు. 1.బోరం సాయికుమార్, ఈస్ట్ గోదావరి, జిల్లా 2. గాటంపల్లి వెంకత్, ఈస్ట్ గోదావరి జిల్లా, 3. గోదవర్తి శేషుకుమార్, ఈస్ట్ గోదావరి జిల్లా.
నల్లబెల్లి పోలీసులు అరెస్టు చేసిన నిందితులు: 4.భూక్యా రాములు మహబూబాబాద్ జిల్లా, 5. ఎస్.కె. కలీల్, మహబూబాబాద్. 6.కొనమల సునీల్, కరీంనగర్ జిల్లా.
ఖానాపూర్ పోలీసులు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక కు చెందిన బత్ర నరేష్, తూముల క్రాంతికుమార్, తమ్మల నాగరాజు, జి.మనోజ్, మారంపూడి శ్రీను వున్నారు.
ఈ అరెస్టులకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మాట్లాడుతూ… జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో నిందితులు ముఠాలుగా ఏర్పడి ఆంధ్ర మరియు ఒడిషా సరిహద్దు రాష్ట్రాల్లో సిలేరు, మోతుగూడెం ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయిని కోనుగోలు చేసి రహస్యంగా కారులో విశాఖపట్నం, రాజమండ్రి, భద్రచలం, కొత్తగూడెం, నర్సంపేట, ఖమ్మం పట్టణాల మీదుగా వరంగల్ పోలీస్ కమిషరేట్ మీదుగా ఇతర ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు గంజాయిని అమ్మి నిందితులు సోమ్ము చేసుకోనేవారు.
ఈ మూడు సంఘటనల్లో నిందితులు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్లుగా టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వర్థన్నపేట పోలీసులతో కలిసి వరంగల్-ఖమ్మం ప్రధాన రోడ్డు మార్గంలోని డిసి తండా వద్ద నిర్వహించిన వాహనతనీఖీలు నిర్వహించగా నిందితుల కారు నుండి సూమారు 128 కిలోల గంజాయి పట్టుపడగా, మరో సంఘటనలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నల్లబెల్లి పోలీసులతో కల్సి నల్లబెల్లి శివారు ప్రాంతంలోని రామతీర్థం గ్రామ శివారులో నిర్వహించిన వాహనతనీఖీల్లో నిందితులు ఒక కారు మరియు ఆటోలో 134 కిలోల గంజాయి స్మగ్లింగ్ కు చేస్తూ పోలీసులకు చిక్కారు. మూడవ సంఘటనలో టాఫోర్స్ పోలీసులు ఖానాపూర్ పోలీసులతో కల్సి ఖానాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో నిందితులు రెండు ఆటోల్లో 56కిలోల గంజాయిని తరలిస్తూ పోలీసులకు దోరికిపోయారు.
అలాగే ఈ మూడు సంఘటనల్లో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ డిసిపిలు శ్రీనివాస్ రెడ్డి, వెంకటలక్ష్మీ టాస్క్ ఫోర్స్, వర్ధన్నపేట, నర్సంపేట ఎసిపిలు, ప్రతాప్ కుమార్, రమేష్, ఫణీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ సంతోష్,వరన్నపేట, నర్సంపేట సర్కిల్ ఇన్ స్పెక్టర్లు సదనకుమార్, సతీష్ ఎస్.ఐ రామరావుతో, నల్లబెల్లి ,ఖానాపూర్ ఎస్.ఐలు పాటు టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సొమలింగం కానిస్టేబుల్లు శ్రీను,వి.రాజేష్, రాజు,జె.రాజేష్, హోంగార్డ్ విజయ్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.